కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదు

పూర్వ స్థితికి చేరుకోవడానికి పెద్ద ఎత్తున కృషి చేయాలి: కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: కరోనా మహామ్మారితో కలిసి జీవించడాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కరోనా కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ఈ పరిస్థితి తప్పదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకుతున్న రేటుకంటే, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువగా ఉందని అన్నారు. కరోనా కట్టడికి ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌ చేస్తున్న కృషి అద్బుతమని కెటిఆర్‌ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత తిరిగి యదార్ధ స్థితికి రావడానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆ అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాలని అన్నారు. మౌళిక వసతుల కల్పన కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్ధిక సాయం చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఔషధ నగరికి మౌళిక వసతుల కల్పన కోసం రూ.4వేల కోట్లను కేంద్రం సమకూర్చాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/