టాలీవుడ్ లో మరో విషాదం.. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదు రోజులుగా ముగ్గురు ప్రముఖులు కన్నుమూశారు. నాల్గు రోజుల క్రితం డైరెక్టర్ నాగేశ్వర్ రావు , ఆ తర్వాత శివ శంకర్ మాస్టర్, నిన్న సిరివెన్నెల మృతి చెందారు. ఇలా మూడు సంఘటనలు నాల్గు రోజుల వ్యవధిలలో చోటుచేసుకోవడం తో అంత షాక్ లో ఉన్నారు. ఓ పక్క సిరివెన్నెల అంత్యక్రియలు మొదలు అయ్యోలోపే మరో విషాదం ఇండస్ట్రీ లో చోటుచేసుకుంది.

హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు. ఇక అబ్బవరం కిరణ్ ఇటీవలే “ఎస్ఆర్ కల్యాణ మండపం”లో హీరోగా కన్పించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.