నాఫై ట్రోలింగ్ చేయిస్తుంది..ఆ హీరో కు చెందిన కంపెనే – మంచు విష్ణు

MANCHU VISHNU

మంచు విష్ణు..మా ఎన్నికల ముందు వరకు పెద్దగా వార్తల్లో నిలిచింది లేదు. జస్ట్ సినిమా టైం లో మాత్రమే మంచు విష్ణు పేరు వినిపించింది. కానీ మా ఎన్నికల తర్వాత మంచు విష్ణు ఏంచేసినా అది ట్రోలింగ్ కు గురి అవుతుంది. ఇటీవల కాలంలో మరి ఎక్కువైంది. దీంతో మంచు విష్ణు ఈ ట్రోలింగ్ ఫై సీరియస్ అయ్యారు. త‌న తాజా చిత్రం జిన్నా మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్స్‌తో మంచు విష్ణు మంగ‌ళ‌వారం మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌ద‌రు హీరో జూబ్లిహిల్స్‌లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని విష్ణు ఆరోపించారు. ఇప్ప‌టికే తాను పూర్తి వివ‌రాలు సేక‌రించాన‌ని చెప్పుకొచ్చారు. ఆ హీరో న‌డుపుతున్న ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించాన‌ని.. త్వ‌ర‌లోనే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు స‌మ‌గ్ర ఆధారాల‌తో ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు.

ప్రస్తుతం మంచు విష్ణు నటించిన జిన్నా చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 5వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, అక్కినేని నాగార్జున ది గోస్ట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తన సినిమాను 21 కి వాయిదా వేశారు.