విజయవాడలో దారుణం : చేతికి పురుగు కుట్టిందని డాక్టర్ వద్దకు వెళ్లితే.. చేయినే తీయాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు

డాక్టర్ ను దేవుడిగా కొలుస్తారు..పోయే ప్రాణాన్ని సైతం డాక్టర్స్ తిరిగి ప్రాణం పోస్తారు..అందుకే వారిని కనిపించే దేవుడు అంటారు. అలాంటి డాక్టర్స్ లలో కొంతమంది ఇటీవల డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చీమ కొట్టిందని వెళ్తే..రకరకాల టెస్ట్ లు చేసి డబ్బు లాగేస్తున్నారు. తాజాగా విజయవాడ లో అలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

కృష్ణా జిల్లా విసన్న పేట గ్రామానికి చెందిన తులసి (22 ) ఇళ్లు శుభ్రం చేస్తున్న సమయంలో చేతికి పురుగు కుట్టినట్టు అనిపించింది. అక్కడ కాస్త వాపు రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లింది.చేతికి ఇన్ఫెక్షన్ అయ్యిందని.. చెప్పడం తో ఆమె.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి వైద్యులు ఇమె చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ ని తొలగించి కట్టుకట్టారు. డ్రెస్సింగ్ చేసే సమయంలో ఓ సర్జికల్ పరికరాన్ని చేతికి వేసి కట్టు కట్టారు. దాంతో ఇన్ఫెక్షన్ చేతికి మొత్తం పాకిపోయింది. దీంతో తులసి నొప్పి భరించలేక మళ్లీ ఆస్పత్రికి వెళ్లింది.. చేతిని పరీక్షించిన వైద్యులు అసలు విషయం తెలుసుకొని ఖంగు తిన్నారు. కట్టు కట్టి అందులో సర్జికల్ బ్లేడ్ ఉంచడం వల్లనే ఇన్ఫెక్షన్ పూర్తిగా వ్యాపించి ఇంత దారుణం జరిగిందని తెలుసుకున్న డాక్టర్లు తమ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. డాక్టర్ చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు తులసి చేయి పూర్తిగా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పురుగు కుట్టిందని డాక్టర్ల వద్దకు వెళితే.. చివరికి చేయినే తీయాల్సిన పరిస్థితి రావడంతో తులసి కన్నీరుమున్నీవుతుంది.