సరిహద్దు భద్రతపై ఆర్మీ చీఫ్‌ సమీక్ష

Manoj Mukund Naravane
Manoj Mukund Naravane

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణె ఈరోజు లేహ్‌ వెళ్లనున్నారు. అక్కడ ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ల‌డ‌ఖ్‌లోని లేహ్‌లో ఆయ‌న స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సీనియ‌ర్ ఫీల్డ్ క‌మాండ‌ర్లు.. స‌రిహ‌ద్దు ప‌రిస్థితిపై ఆయ‌న‌కు వివ‌రించ‌నున్నారు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉన్న ఉద్రిక్త‌త‌ల గురించి ఆర్మీ చీఫ్ తెలుసుకోనున్నారు. ద‌ళాలు ఎంత వ‌ర‌కు స‌మాయ‌త్తంగా ఉన్నాయో ఆర్మీ చీఫ్‌కు విశ్లేషించ‌నున్నారు. గ‌త మూడు నెల‌లుగా వాస్త‌వాధీన రేఖ వెంట ఉద్రిక్త‌త నెల‌కొని ఉన్న విష‌యం తెలిసిందే. తాజాగా చైనా ద‌ళాలు మ‌ళ్లీ దుస్సాహ‌సం చేశాయి. ఈ నేప‌థ్యంలో పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ఆందోళ‌నక‌ర ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. చైనా ద‌ళాల‌ను అడ్డుకునేందుకు భార‌తీయ ఆర్మీ నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


తాజా అంతర్జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/