రానా బర్త్ డే స్పెషల్ : విరాటపర్వం నుండి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో

దగ్గుపాటి రానా పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ , వీడియోస్ వచ్చి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ నుండి రానా తాలూకా పోస్టర్ విడుదలై ఆకట్టుకోగా..తాజాగా విరాటపర్వం నుండి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో విడుదల చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.

”మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే” అంటూ వీడియో ప్రారంభం అవుతుంది. రానా దగ్గుబాటి,సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రానికి వేణు ఊడుగుల డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా రూపొందుతుంది విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.దాదాపు షూటింగ్‌ పూర్తియిన ఈ సినిమా ట్రైలర్‌ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రానా బర్త్‌డే సందర్భంగా సాయిపల్లవి సహా పలువురు ప్రముఖుల నుంచి రానాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.