అమర్‌నాథ్‌ యాత్రకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం..

amarnath yatra
amarnath yatra

న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌లో 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. అమర్‌నాథ్‌కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం మార్గం, గందేర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకోవచ్చు. ఈ విషయాలను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు.

13 నుంచి 37 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాలి. యాత్రికులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్ యాత్రను సందర్శించడానికి దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.