హైదరాబాద్ లో వడగళ్ల వర్షం

మండు వేసవిలో కూడా హైదరాబాద్ ను చల్లబరుస్తుంది వాతావరణం. గత వారం రోజులుగా నగరంలోని పలుచోట్ల వడగళ్ల వర్షం పడుతూ వస్తుంది. సోమవారం (ఏప్రిల్ 17) న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన దంచి కొట్టింది. నాంపల్లి, హైకోర్టు, లక్డీకపూల్, ఆబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠీ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవగా చంచల్ గూడ, సైబాదాద్, చంపాపేట్, హిమాయత్ నగ్, బాలాపూర్, కర్మన్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, రాజేంద్ర నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ లో లో వానా దంచికొట్టింది.

దుకాణాలు, ఆఫీస్ ల నుండి బయటకు వెళ్లిన వాహనదారులు, పాదచారులు తడిసిముద్దయ్యారు. చాలామంది వర్షం తగ్గిపోయే వరకు మెట్రో కింద తలదాచుకున్నారు. కొన్నిచోట్ల నీరు నిల్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి ఉక్కపోత, సాయంత్రానికి వడగళ్ల వాన అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.