రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితున్ని విడుదల చేయాలనీ తీర్పు

రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలనీ సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 31 ఏళ్లుగా ఏజీ పెరరివాలన్ జైల్లో ఉన్నాడు. ఈ తరుణంలో క్షమాభిక్ష అభ్యర్థనపై ఏజీ పెరరివాలన్ విడుదల చేస్తూ సుప్రీం కోర్ట్ నిర్ణయం తీసుకుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం అధికారాన్ని ఉపయోగించుకుని.. రాజీవ్ గాంధీ హత్య కేసులో పేరారివాలన్ మరియు ఇతర దోషులకు క్షమాపణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అయితే, గవర్నర్ ఈ విషయాన్ని భారత రాష్ట్రపతికి సూచించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 సంవత్సరాలు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఇక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది.