చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఈ ఉదయం చేరుకున్న అధికారులు రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి మొత్తం ఆరుగురు అధికారులు చేరుకున్నారు. భద్రతా సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లారు. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, విచారణకు హాజరు కావాల్సిందిగా కోరామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/