తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం: బండి సంజయ్

double-engine-government-is-certain-to-come-in-telangana-bandi-sanjay

హైదరాబాద్‌ః తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం ఓడిపోక తప్పదని చెప్పారు. అభివృద్ధి చేసే వాళ్లే గెలుస్తారన్న బండి సంజయ్.. అవినీతిపరులు పడిపోతారని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడిది నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” మొదలైంది. సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట్ మీదుగా వేంపేట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుండగా.. వెంపెట్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. ఈరోజు మొత్తం12.6 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/