47వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 47వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆదివారం నుంచి రైతుల ఉద్యమానికి మద్దతుగా జనసేన, బిజెపి ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయి. దీనిలో భాగంగా ఇరు రాష్ట్రాల నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలకు మద్దతుగా గతంలోనే రాజధాని గ్రామాల్లో పర్యటించాలని జనసేన, బిజెపి పార్టీలు నిర్ణయించాయి. తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించాలని నేతలు భావించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో సాధారణ పర్యటనగా మార్చారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports