మేడారానికి హెలికాప్టర్‌ సేవలు

Helicopter-Services-For-Medaram
Helicopter-Services-For-Medaram

హైదరాబాద్‌: మేడారం జాతరకు తెలంగాణా టూరిజం తరపున హెలికాప్టర్ సర్వీస్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మేడారం జాతరను, ఆదివాసీ, గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్‌ నుంచి మేడారం హెలికాప్టర్‌ టికెట్ ధర రూ.30వేలు (అప్ అండ్ డౌన్, వీఐపీ దర్శనం), అలాగే మేడారంలో ఏరియల్‌ వ్యూ టికెట్ ధర రూ.2,999. ఈ అవకాశాన్ని భక్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పస్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/