ధనిక రాష్ట్రంలో ధాన్యం కొనలేరా అంటూ కేసీఆర్ ఫై ఈటెల ఫైర్

ధనిక రాష్ట్రంలో ధాన్యం కొనలేరా అంటూ కేసీఆర్ ఫై ఈటెల ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని.. అసహనం మొత్తాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. ఈ ఏడాది కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని ఆరోపించారు. రైతాంగం పండించిన ధాన్యంపై మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతోందని తెలిపారు.

కేసీఆర్ రాజకీయాలు పక్కనపెట్టి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం కొంటుందో.. లేదో అయోమయానికి గురైన రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందన్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని.. దంపుడు బియ్యం వద్దని చెప్పిందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.

రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ముందే చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు.