ముఖ్యమంత్రి జగన్​కు అల్లు అరవింద్​ విజ్ఞప్తి..

మొన్నటి వరకు సామాన్య ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని వేడుకోవడం చూసాం..ఇక ఇప్పుడు చిత్రసీమ ప్రముఖులు తమ సమస్యలు పరిష్కరించాలని జగన్ ను వేడుకోవడం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం ఆఫీస్ చుట్టూ సినీ ప్రముఖులు ప్రదిక్షణలు చేస్తున్నారు. ముఖ్యముగా సినిమా టికెట్స్ ధర , అదనపు షోస్ మొదలగు వాటి గురించి జగన్ ను చిత్రసీమ అడుగుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నాని కలిసి తమ ఆవేదనను తెలుపడం జరిగింది.

ఇక ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం తన విజ్ఞప్తి ని జగన్ కు తెలియజేసారు. తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టాల్లో ఉందని, సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించాలని జగన్​కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు విడుదలయ్యే సినిమాలన్నీ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయన్న అల్లు అరవింద్… రాజు తలచుకుంటే వరాలకు కొదవా.. అని వ్యాఖ్యానించారు.
కరోనా నుంచి ప్రజలను రక్షించినట్టుగానే సినీ పరిశ్రమను కాపాడాలని కోరారు. పరిశ్రమ విజయవంతంగా కొనసాగాలంటే ముఖ్యమంత్రి జగన్ సహకారం అవసరమన్నారు.