ఆందోళనలో పోసాని నిర్మాతలు

పోసాని నిర్మాతలు ఆందోళన బాట పట్టారు. గత మూడు రోజులుగా పోసాని అందుబాటులో లేరని , కనీసం ఫోన్ కూడా కలవడం లేదని, ఆయన కారణంగా షూటింగ్ లు ఆగిపోయాయని , నటి నటుల కాల్ షీట్స్ వృధా అవుతున్నాయని వారంతా వాపోతున్నారు. ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ తర్వాత కంటాక్ట్ చేయడానికి కుదరడంలేదని పోసాని మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. పోసాని ఎప్పుడు అందుబాటులోకి వస్తారనేది తెలయడంలేదని వాపోతున్నారు.

గత వారం రోజులుగా చిత్రసీమ తో పాటు ఏపీ రాజకీయాల్లో మూవీ టికెట్స్ వ్యవహారం హాట్ హాట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో టికెట్స్ ధరల విషయంఫై పవన్ కళ్యాణ్ ..వైసీపీ సర్కార్ తీరు ఫై మండిపడ్డారు. ఆ తర్వాత వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళి ..పవన్ కళ్యాణ్ ఫై తీవ్రపదజాలం వాడడం తో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పోసాని ప్రెస్ మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులతో తనకు ప్రాణ హాని ఉందని పోసాని వ్యాఖ్యానించారు. అయితే పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. ఈ పని చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసేన కార్యకర్తలే అని పోసాని అభిప్రాయపడ్డారు. అయితే, పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది తెలంగాణ జనసేన. మొత్తం మీద పోసాని అందుబాటులో లేకపోవడం నిర్మాతలకు తలనొప్పిగా మారింది.