బర్త్ డే విషెష్ తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం తన 41 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఆయనకు బర్త్ డే విషెష్ అందించారు. ఈ క్రమంలో తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. ‘‘అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, శుభాకాంక్షలకు థ్యాంక్యూ. నేను నిజంగా ధన్యుడిని. ఎప్పటికీ కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు.

అలాగే జూ. ఎన్టీఆర్ – అల్లు అర్జున్ మధ్య సాగిన ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అభిమానులైతే తెగ సంబరపడుతున్నారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని ఎన్టీఆర్ ట్వీ్ట్ చేశారు. దీనికి రిప్లైగా బన్నీ..‘‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్’’ అని చెప్పారు. వెంటనే రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్..కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా? అంటూ పుష్పా డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ ట్వీ్ట్ చేశారు. దీంతో.. బన్నీ కూడా ‘‘వస్తున్నా’’ ఎన్టీఆర్ 30లోని డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా సమాధానమిచ్చారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఫన్నీ గా ట్వీట్స్ చేసుకోవడం అభిమానులను ఎంతో సంతోష పెట్టింది.