కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదు..,టెన్త్ పరీక్షల్లో – టీడీపీ నేత జవహర్

ఏపీ రాజకీయాలు మరోసారి మరింత వేడెక్కాయి. ఇటీవల విడుదలైన టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ కావడం ఫై టీడీపీ ప్రభుత్వం ఫై ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం జూమ్ వీడియోలో టెన్త్ ఫెయిల్ అయినా విద్యార్థులతో అలాగే తల్లిదండ్రులతో మాట్లాడి దైర్యం నింపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తో పాటు మరొక నేత దేవేందర్ రెడ్డి లు జూమ్ వీడియో లో వచ్చి షాక్ ఇచ్చారు.

వైసీపీ నేతలు ఒక్కసారిగా కనిపించడం తో నిర్వాహకులు వారి కాల్ ను కట్ చేసారు. వీరి రాకపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ , అచ్చెన్న, అయ్యన్న తదితరులు కొడాలి నాని ఫై విమర్శలు కురిపించగా.. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ… కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదని, పదో తరగతి పరీక్షల్లో అని అన్నారు. వేలిముద్రగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేశారు. సీఎంతో పాటు ఆయన సహచరులందరికీ చదువంటే చాలా చులకన భావం ఉందని చెప్పారు. తమ నేత లోకేశ్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తుంటే… వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలో చదువులు ఎటు పోతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందని చెప్పారు.

అంతకు ముందు అయ్యన్న ట్విట్టర్ ద్వారా..”8 క్లాస్ ఫెయిల్ అయిన సన్న బియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం. గడప గడప కి వెళ్తుంటే ప్రజలు చెప్పుతో కొడుతున్నారు అందుకే ఆ కార్యక్రమం వదిలేసి జూమ్ కి వచ్చారు. విద్యా వ్యవస్థ ను నాశనం చేసిన జగన్ రెడ్డి రోడ్ల మీదకి వెళ్తే జనం పరిగెత్తించి కొడతారు అనే భయంతోనే పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు”. అంటూ కొడాలి ఫై ట్వీట్ చేశారు.