మాస్కులు తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగం

mask wear
mask wear

హైదరాబాద్‌: కరోనా నివారణ ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లనుంచి బయటకువచ్చే వారు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కోంతమందిలో ఎటువంటి లక్షణాలు లేనప్పటికి కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్‌ సోకకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆఫీసులు, పనిచేసే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని వారుకూడా మాస్క్‌లు వాడాలని పేర్కోన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/