ఎన్ క‌న్వెన్ష‌న్ ఫై బన్నీ అభిమానుల దాడి

అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహంతో రెచ్చిపోయారు..ఎన్ క‌న్వెన్ష‌న్ ఫై దాడి చేసారు. దీంతో పలువురు అభిమానులకు గాయాలు అయ్యాయి. అసలు ఏంజరిగిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ అభిమానులు ఉన్నారో తెలియంది కాదు..కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ నుండి సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తారు. ప్రస్తుతం బన్నీ నటించిన పుష్ప ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్స్ ను భారీగా చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా జరిపారు.

ఇదిలా ఉండగానే బన్నీ .. సినిమా విడుద‌ల‌కు ముందు త‌న అభిమానుల‌ను క‌లుసుకోవాల‌ని అనుకున్నారు. వారితో మాట్లాడి వారికి ప్ర‌త్యేకంగా ఫొటోలు ఇవ్వాల‌ని అనుకున్నారు. అభిమాన సంఘాల‌కు ఈ కబురు వెళ్లడం తో.. భారీగా అభిమానులు వ‌చ్చేశారు. ఒక వైపు గీతా ఆర్ట్స్‌, మ‌రో వైపు ఎన్ క‌న్వెన్ష‌న్‌ల‌కు అభిమానులు త‌ర‌లి వెళ్లారు. త‌మ అభిమాన హీరోతో ప్రత్యేకంగా ఫొటో తీసుకోవాల‌నేది వారి ఆశ‌. ఎన్ క‌న్వెన్ష‌న్ ద‌గ్గ‌ర అభిమానుల‌తో ఫొటోలు దిగాల‌ని బ‌న్నీ అనుకున్నారు. దానికి పోలీసుల ప‌ర్మిష‌న్ కూడా తీసుకున్నారు. కానీ చివర్లో ఈ కార్యక్రమం రద్దయింది. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరి మధ్య తోపులాట జరగడంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. కొంతమంది అభిమానులు కోపంతో ఎన్ క‌న్వెన్ష‌న్ అద్దాల‌ను ప‌గ‌ల గొట్టేశారు. దీంతో పోలీసులు ఎన్ క‌న్వెన్ష‌న్ చేరుకుని అభిమానుల‌ను పంపేశారు.