ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్‌ను ప్రారంభించిన మోడీ

PM Modi inaugurates Submarine Cable Connectivity to Andaman & Nicobar Islands via VC

న్యూఢిల్లీ :ప్రధాని మోడీ చెన్నై- పోర్ట్ బ్లెయిర్ మ‌ధ్య ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ క‌నెక్టివిటిని  ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఈజీ ఆఫ్ లీవింగ్ పెరుగుతుంద‌ని మోడీ తెలిపారు. ఓఎఫ్‌సీతో నికోబార్ ప్ర‌జ‌ల‌కు మొబైల్ క‌నెక్టివిటి‌, వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్ ల‌భిస్తుందన్నారు. అండ‌మాన్ ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ ఇండియా లాభాలు అందుతాయ‌న్నారు.  టూరిజం, బ్యాంకింగ్‌, షాపింగ్‌, టెలిమెడిసిన్ లాంటి వ‌స‌తులు.. వేలాది మంది అండ‌మాన్ ప్ర‌జ‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంటుందన్నారు. ఆప్టిక్ ఫైబ‌ర్ కేబుల్ వ‌ల్ల‌ ఎక్కువ‌గా లాభం టూరిస్టుల‌కు ల‌భిస్తుందని ప్ర‌ధాని మోడీ తెలిపారు. టూరిస్టులు ఎక్కువ స‌మ‌యం అండ‌మాన్‌లో గ‌డిపే అవ‌కాశాలు ఉంటాయని, దీంతో అక్క‌డ రోజ్‌గార్ పెరుగుతుందన్నారు. అనుకున్న స‌మ‌యానికి 2300 కిలోమీటర్ల దూరం స‌ముద్రం లోప‌ల కేబుల్ వేయ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని మోడీ తెలిపారు. 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/