చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు : పువ్వాడ

సాయి గణేశ్ ఆత్మహత్య నేపథ్యంలో పువ్వాడపై ఆరోపణలు

హైదరాబాద్: ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య అంశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయి గణేశ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికి కారణం మంత్రి పువ్వాడ అజయే అని… ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మంలో చిన్న ఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు చేస్తున్న వారితో చాలా మంది చేతులు కలిపారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రిని తానే అని అన్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కమ్మ వారికి ఉన్న ఏకైక మంత్రి పదవిని పీకేశారని చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/