హనుమకొండ లో దారుణం : ప్రేమించడం లేదని యువ‌తి గొంతు కోసిన ఉన్మాది

రోజు రోజుకు యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించమని వేధించడం..ప్రేమించకపోతే చంపేయడం చేస్తున్నారు. శుక్రవారం హనుమకొండ లో ఇదే దారుణం జరిగింది. న‌ర్సంపేట ప‌రిధిలోని ల‌క్నెప‌ల్లి గ్రామానికి చెందిన అనూష‌(23) కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎంసీఏ ఫైన‌లియ‌ర్ చ‌దువుతోంది. చ‌దువు రీత్యా అనూష‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు పోచ‌మ్మ గుడి స‌మీపంలోని గాంధీ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్నారు. కాగా త‌న‌ను ప్రేమించాల‌ని అజ‌హ‌ర్ అనే యువ‌కుడు..కొద్దీ రోజులుగా అనూష‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. అనూష‌నేమో అజ‌హ‌ర్ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం ఇంట్లో ఒంటరిగా ఉన్న అనూష దగ్గరికి వెళ్లి త‌న‌ను ప్రేమించాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో అనూష గొంతును కోసి ప‌రారీ అయ్యాడు.

అప్పుడే ఇంట్లోకి వచ్చిన అనూష తల్లి..అప్పుడే ఇంటికి వ‌చ్చిన త‌ల్లి.. తీవ్ర ర‌క్తస్రావంతో బాధ‌ప‌డుతున్న అనూష‌ను చూసి షాక్‌కు గురైంది. స్థానికుల స‌హాయంతో 108 అంబులెన్స్‌లో వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనూష‌కు వైద్యులు చికిత్స అందించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనూష ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనూషకు మంచి వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. అనూషపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.