గర్భిణీలకు ఆల్కలైన్ నీళ్లు

ఆహారం – ఆరోగ్యం

Alkaline water for pregnant women
Alkaline water for pregnant women

గర్భిణీల శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజ లవణాలు అందేలా, జీవ క్రియలు సక్రమంగా జరిగేలా ఉదయం ఆల్కలైన్ నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఇది ఔషధంగా పనిచేసి తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు.

ఆల్కలైన్ నీళ్లు తయారీ:

కాచి వాడకట్టిన లీటరు నీళ్లను తీసుకోవాలి.. ఇందులో అర చెక్క నిమ్మకాయ రసాన్ని పిండాలి.. మరో అర చెక్క నిమ్మను పలుచని చక్రాలుగా కోసి ఈ నీటిలో వేయాలి…

చెంచాలో 8వ వంతు పింక్ సీ సాల్ట్ ను వేసి బాగా కలిపి సీసా మూత పెట్టాలి.. రాత్రంతా లేదా 8 నుంచి 9 గంటలు నాననివ్వాలి.. ఇలా తయారైన ఆల్కలైన్ నీటిని పరగడుపున తీసుకోవాలి.

ప్రయోజనాలు:

సాధారణ నీటితో పోలిస్తే ఇందులో పి హెచ్ స్థాయిలు రెట్టింపు… ఇది శరీరంలోని అసిడిటీ ని తగ్గిస్తుంది… ఆహారాన్ని తేలికగా జీర్ణ మయ్యేలా చేస్తుంది.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఎసిడిటిని పెంచేలా ఉండి, అజీర్తి, కడుపు నొప్పి వంటి పలు రకాల అనారోగ్యాలను తెచ్చిపెడతాయి.. ఈ ఆల్కలైన్ నీళ్లలోని పి హెచ్ స్థాయిలు ఇలాంటి సమస్యలను దరిచేరనీయకుండా రక్షిస్తాయి.. ఇందులోని క్యాల్షియం ఎముకల బలహీనతను దూరం చేస్తుంది.. అలాగే గర్భిణీలలో రక్తపోటును అదుపు చేసే మెగ్నీషియం ఈ నీటితో అందుతుంది..

సోడియం, పొటాషియం కండరాలను శక్తిమంతంగా మార్చి వ్యాధి నిరోధకతను పెంచుతాయి.. ఇందులోని యాంటీ ఆక్సీడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను నశింపజేస్తాయి.. శరీరంలోని మలినాలు బయటకు పోయి, జీర్ణశక్తి పెరుగుతుంది.. అధిక బరువు సమస్య ఉండదు..

ఇందులోని పోషకాలు జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను పలుచన చేసి జీర్ణ సంబంధిత సమస్యలను రానివ్వవు.. డీహైడ్రేషన్ దూరమై, నిస్సత్తువ నుంచి బయట పడవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ తల్లి ఆరోగ్యాన్ని రక్షించటంతో పాటు బిడ్డ ఎదుగుదలలోనూ తోడ్పడుతాయి.

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/