ప్రాణాయామం తో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నియంత్రణ

ఆరోగ్య భాగ్యం

మనం కొన్ని వైరస్ లతో ఇన్ఫెక్షన్ ప్రభావానికి గురి అయిన ఊపిరితిత్తులు కోలుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.. ఇందు కోసం ప్రాణాయామంతో పాటు ఊపిరితిత్తులను బలపరిచే కొన్ని వ్యాయామాలు చేయాలి ..

Pranayama
Pranayama

ప్రాణాయామం:

బొటన వేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి, ఎడమ నాసికా రంధ్రంతో గాలి పీలుస్తూ నాలుగు అంకెలు లెక్క పెట్టాలి. తర్వాత ఎడమ నాసికా రంధ్రాన్ని కూడా మూసి, 16 అంకెలు లెక్క పెట్టాలి…
తర్వాత కుడి నాసికా రంధ్రాన్ని తెరచి 8 అంకెలు లెక్క పెడుతూ పూర్తిగా ఊపిరి వదలాలి.. ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచి, కుడి నాసిక ద్వారా 4 అంకెలు లెక్క పెడుతూ ఊపిరి పీల్చాలి
నాసికా మూసి ఉంచి, 16 అంకెలు లెక్క పెట్టే వరకూ శ్వాసను నిలిపి ఉంచాలి.. ఎడమ నాసిక రంధ్రాన్ని తెరచి , 8 అంకెలు లెక్క పెట్టే వరకూ శ్వాస వదలాలి.

స్పైరో మెట్రీ

ఈ పరికరాన్ని నోటిలో ఉంచుకుని, పెదవులతో బిగించి పట్టుకోవాలి.. ఇండికేటర్ గోల్ మార్కర్ ను తాకే వరకూ నెమ్మదిగా శ్వాస పీల్చుకోవాలి.. గాలిని పీల్చుకోలేని పరిస్థితి తలెత్తినపుడు పరికరాన్ని నోటిలో నుంచి తొలగించి, కనీసం మూడు సెకండ్లు పాటు గాలిని బిగబట్టి ఉంచి శ్వాస వదలాలి.. వైద్యులు సూచించినన్నిసార్లు స్పైరో మెట్రీని ఈ విధంగా ఉపయోగించాలి

‘నాడి’ (ఆరోగ్య సలహాలు, సూచనలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/