ఫిల్మ్ స్కూల్లో చేరిన పవర్ స్టార్ తనయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ..అమెరికా లో ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇటీవల నార్వేలోని స్టావెంజర్ లో బాహుబలి చిత్రం మ్యూజిక్ సింఫనీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ తదితర ప్రముఖులు విచ్చేశారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్ లతో కలిసి ఫొటోకు పోజు ఇచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ… “నాలుగోతరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నాను. నా మనవడు కార్తికేయ, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్… వీరిద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు” అని వెల్లడించారు. ఈ మేరకు వారిద్దరితో తాను కలిసి ఉన్నప్పటి ఫొటోను రాఘవేంద్రరావు పంచుకున్నారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.