ఇటలీలో 8500 కు చేరిన కరోనా బాధిత కేసులు
కరోనా వైరస్‌తో మృతి చెందిన 631 మంది

రోమ్: కరోనా వైరస్ ఇటలీలో వణుకుపుట్టిస్తుంది. ఇప్పటివరకు ఈవైరస్ బారిన పడి 631 మంది మృతి చెందగా, కరోనా బాధితుల సంఖ్య 8514కు చేరింది. ఈమేరకు సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఏంజెలో బరేలీ ఈ వివరాలను వెల్లడించారు. కరోనా వైరస్ ఎమర్జన్సీ కారణంగా ఆమెకు ఇటలీ ప్రభుత్వం జాతీయ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. వ్యాధికి గురైన వారిలో కొద్దిమంది 50-59 సంవత్సరాలలోపు ఉండగా, 8 శాతం మంది 60-69, 32 శాతం మంది 70-79, 45 శాతం 80-89, 14 శాతం 90 ఏళ్ల పై బడినవారు ఉన్నట్లు ఆమె వివరించారు. కరోనా కారణంగా.. ఇటలీ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రజలు గుమిగూడే ప్రాంతాలు.. సినిమా థియేటర్లు, నైట్ క్లబ్స్‌లను సైతం మూసివేశారు. ప్రజలు ఎలాంటి కార్యక్రమాలున్నా రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/