కరోనా ఎఫెక్ట్‌ ..ఢిల్లీలో స్కూల్స్ బంద్

delhi-schools
delhi-schools

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సోకిన వ్యక్తి తన కుమారులు చదువుతోన్న పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఐదు పాఠశాలలకు బుధవారం నుంచి సెలవులు ప్రకటించారు. మంగళవారం రెండు స్కూల్స్ మూసివేయగా, బుధవారం మరో రెండు బ్రాంచిలను శ్రీరామ్ మిలీనియం స్కూల్ మూసివేసింది. ఈ స్కూల్‌లోనే కోవిడ్ వ్యాధిగ్రస్తుడి కుమారులు చదువుతున్నారు. గౌతమ్ బుద్ధ్ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనలు ప్రకారం శుక్రవారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నొయిడాలోని శివ్ నాడార్ స్కూల్ మార్చి 10 వరకు సెలవులను ప్రకటించింది. మరోవైపు, వసంత్ విహార్‌లోని బ్రాంచ్ గురువారం నుంచి, ఆరావళి, మౌళసరి క్యాంపస్‌లను మార్చి 9 నుంచి మూసివేస్తున్నట్టు శ్రీరామ్ మిలీనియం స్కూల్ తెలిపింది. వేసవి విరామం ముందే వచ్చిందని, పాఠశాలను శుభ్రం చేయడానికి సెలవు రోజులను సద్వినియోగం చేసుకుంటామని స్కూల్ యాజమాన్యం వివరించింది. కోవిడ్ వ్యాధిగ్రస్తుడితో ఆగ్రాకు చెందిన ఆరుగురు, పుట్టిన రోజు వేడుకలకు హాజరైన వారు సహా కనీసం 70 మంది కాంటాక్ట్ అయినట్టు గుర్తించి వారిని పర్యవేక్షిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/