భారత్ డ్రోన్ మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని

YouTube video
Prime Minister Narendra Modi Inaugurates Bharat Drone Mahotsav, Pragati Maidan, Delhi | PMO

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్యక్రమం అయిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్’ను ఢిల్లీలో ప్రారంభించారు. ఈసందర్బంగా ప్రధాని మాట్లడుతూ ..ప్రపంచ డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వాల కాలంలో టెక్నాలజీని సమస్యగా చూశారు. పేదలకు వ్యతిరేకమని చూపించే ప్రయత్నాలు జరిగాయి. అందుకనే 2014కు ముందు పాలనలో టెక్నాలజీ వినియోగం పట్ల ఉదాసీన వాతావరణం నెలకొంది. పేదలు మరింత కష్టాలు పడ్డారు. మధ్య తరగతి వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు’’ అని ప్రధాని చెప్పారు.

స్మార్ట్ టెక్నాలజీ దేశ సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ప్రధాని అన్నారు. డ్రోన్ టెక్నాలజీ పట్ల దేశంలో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే డ్రోన్ రంగం అతిపెద్దదిగా అవతరించి, భారీగా ఉపాధి అవకాశాలను తీసుకొస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2026 నాటికి డ్రోన్ పరిశ్రమ రూ.15,000 కోట్లకు చేరుకుంటుందని, దేశంలో 270 డ్రోన్ స్టార్టప్ లు ఉన్నట్టు ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. డ్రోన్ తయారీ స్టార్టప్ లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/