సిరిసిల్లలో మఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

Sirisilla: తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిసిల్ల చేరుకున్న ఆయన తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద 27 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ టు పద్ధతిలో రూ. 83.37 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,320 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహప్రవేశం చేయించారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనంలో తరగతి గదులను పరిశీలించారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/