కరోనా కేసుల్లో మూడో స్థానంలో రష్యా

దేశంలోని సగానికి పైగా మరణాలకు కరోనా కారణం కాదు..ఆ దేశ ఆరోగ్యశాఖ

coronavirus -russia
coronavirus -russia

రష్యా: రష్యాలో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అయితే అక్కడ మరణాలన్నింటీకి కరోనా మహమ్మారి కారణం కాదని, దాదాపు 60శాతం మరణాలకు గుండెపోటు, లుకేమియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులే కారణమని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా కరోనా మరణాల సంఖ్యలో రష్యా ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,62,843 కేసులు నమోదు కాగా, 2,418 మంది మరణించారు. 58,226 మంది కోలుకోగా, 2,02,199 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కేసులు సంఖ్య శరవేగంగా పెరుగుతున్నప్పటికీ మరణాలు మాత్రం అతి తక్కువగా నమోదవుతుండడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కావాలనే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తోందన్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆరోగ్యశాఖ ఏప్రిల్‌లో కరోనా కారణంగా 639 మంది మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 60 శాతం మరణాలకు కరోనా కారణం కాదని పేర్కొంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/