శివశంకర్ మాస్టర్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం

శివశంకర్ మాస్టర్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం

కరోనా మహమ్మారి చిత్రసీమ లో మరో గొప్ప వ్యక్తి కమ్మునుశారు ఆయనే శివ శంకర్ మాస్టర్. తెలుగు , తమిళ్ తో పాటు మిగతా అన్ని భాషల్లో తన ప్రతిభ చాటుకొని ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ అనుకున్న శివ శంకర్ మాస్టర్ ఆదివారం కరోనా తో మృతి చెందారు. గత కొద్దీ రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటూ వస్తున్నప్పటికీ..ఆ మహమ్మారి నుండి బయట పడలేకపోయారు. ఈయన క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికీ..ఆ దేవుడు మాత్రం ఆయన్ను తిరిగిరాని లోకానికి తీసుకెళ్లారు. ఈయన మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ దిగ్భాంతి వ్యక్తం చేశారు.

తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. నాట్య సంప్రదాయాలకు చక్కని అభియనం జోడించారని చెప్పారు. పది భాషల్లో వందలాది చిత్ర గీతాలకు నృత్యరీతులు సమకూర్చారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.‘ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ పరమపదించారని తెలిసి విచారించాను. భారతీయ నాట్య సంప్రదాయాలకు, చక్కని అభినయాన్ని జోడించి దాదాపు 10 భారతీయ భాషల్లోని వందలాది చిత్ర గీతాలకు వారు సమకూర్చిన నృత్యరీతులు అభినందనీయమైనవి.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విటర్‌లో పోస్టు చేశారు.