తెలంగాణ కొత్త సచివాలయంలో శాఖలకు సంబదించిన పొర్లు కేటాయింపు

ఈ నెల 30వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రేపటి (26వ తేదీ) నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల షిఫ్టింగ్ షురూ కానుంది. ఈ నెల 28వ తేదీ వరకు అంటే మూడు రోజుల్లో మొత్తం శాఖలన్నీ షిఫ్ట్​ అయిపోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఇక ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి.

మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్​మెంట్​ శాఖలకు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే సచివాలయం ప్రారంభం రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.