ఆదిత్య ఎల్ -1 ప్రయోగ తేదీని ప్రకటించిన ఇస్రో

సెప్టెంబర్ 2న 11.50కి ఆదిత్య ప్రయోగం

Aditya-L1 mission to study the Sun to be launched on September 2, announces ISRO

బెంగళూరుః ‘చంద్రయాన్‌–3’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ‘ఆదిత్య ఎల్‌–1’ ప్రయోగ తేదీని ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ‘‘సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్–1 ప్రయోనికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి సెప్టెంబర్ 2న 11.50కి పీఎస్‌ఎల్‌వీ–సీ57 ప్రయోగం చేపట్టనున్నాం” అని తెలిపింది.

శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాన్ని లాంచింగ్‌ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ప్రజలను ఆహ్వానించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌ (https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. రేపటి (ఆగస్టు 29) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది.