ఏపీలో బిఆర్ఎస్ అనేది శూన్యం – కొడాలి నాని

తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మర్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల నేతల ఫై నిఘా పెట్టి..వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఫై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జనసేన పార్టీ కీలక నేత తోట చంద్రశేఖర్ ను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

ఇక ఏపీలో పట్టుబిగించాలని కేసీఆర్ చూస్తుంటే..ఏపీలో అసలు బిఆర్ఎస్ అనేదే లేదని అన్నారు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. బీఆర్ఎస్ వల్లే నష్టపోయామని ఏపీ ప్రజలు భావిస్తున్నారని.. జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు ఫై కూడా నాని పలు వ్యాఖ్యలు చేసారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసని.. స్వయంగా ఆయనకు గెలవడం కల అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ సింగల్‌గానే పోటీ చేస్తుందన్నారు.

చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపుతున్నారని.. ఏడాది చివర్లో ఎనిమిది మందిని.. ఇప్పుడు ఏడాది ప్రారంభంలో మరో ముగ్గురిని బలిగొన్న నరరూప రాక్షసుడు అంటూ మండిపడ్డారు.