కరోనా భయం..కరచాలనం చేయమని ప్రకటన

‘నో షేక్‌హ్యాండ్’ అంటున్న ఇంగ్లండ్ టీమ్

Joe-Root
Joe-Root

లండన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌ -19) ప్రపంచదేశాలనే కాదు ఆటగాళ్లను కూడా భయపెడుతుంది. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ ఈనెల 19 నుండి శ్రీలకంతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆ ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని మంగళవారం స్పష్టం చేశారు. దీనికి బదులుగా ఫస్ట్ బంప్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను విష్ చేస్తామని ఇంగ్లిష్ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్ తెలిపాడు. కాగా, ఇంగ్లండ్‌ క్రికెటర్లు షేక్ హ్యాండ్ వద్దనుకోవడానికి కరోనా భయమే కాదు, మరో కారణం కూడా ఉంది. ఇటీవల సౌతాఫ్రికా టూర్‌‌కు వెళ్లిన ఆ జట్టు ఆటగాళ్లలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. జీర్ణసంబంధ సమస్యలు, ఫ్లూ జ్వరంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం సూచనల మేరకు శ్రీలంకలో ఎవరితోనూ కరచాలనం చేయకూడదని, అలాగే వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను కడుక్కొని యాంటీ బాక్టీరియల్ జెల్స్ వాడాలని నిర్ణయించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/