హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం బట్టబయలు

ఈ మధ్య ఎక్కడ చూసిన మసాజ్ సెంటర్లు దర్శనం ఇస్తున్నాయి. కానీ లోపలికి వెళ్లి చూస్తే ఆ మసాజ్ వేరే..బయటకు మసాజ్ పేరుతో బోర్డు పెట్టి..లోపల మాత్రం వ్యభిచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. దీంతో పోలీసులు మసాజ్ సెంటర్ల ఫై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట మసాజ్ ముసుగులో వ్యభిచారం బట్టబయలు అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరో వ్యభిచార మసాజ్ సెంటర్ గుట్టురట్టు చేసారు పోలీసులు.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ” ఎల్లి గంటి బ్యూటీ స్పాలోన్, అంతర్వ హమామ్ స్పా “పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మసాజ్ కేంద్రాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుటాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ..రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి ఆ మసాజ్ సెంటర్ పై ఒక్కసారిగా దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక వీరుడు అలాగే పది మందికి పైగా యువతులను అదుపులోకి తీసుకున్నారు.