కుప్పంలో పోటీపై స్పందించిన నటుడు విశాల్
ఈ వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదు..విశాల్
అమరావతి: హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైస్సార్సీపీ యోచిస్తున్నట్టు ఇటీవల జోరుగానే ప్రచారం జరిగింది. ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు వైస్సార్సీపీ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై సినీ నటుడు విశాల్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను విశాల్ కొట్టిపారేశాడు.
ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరాడు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని ట్విటర్ వేదికగా విశాల్ ప్రకటించాడు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. తాను సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలని కానీ.. చంద్రబాబుపై పోటీ చేయాలని తనకు ఎటువంటి ఆలోచనా లేదని ట్వీట్లో విశాల్ పేర్కొన్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/