బీజేపీ పదాధికారుల సమావేశానికి శ్రీకారం చుట్టిన జేపీ నడ్డా

jp-nadda-inaugurated-bjp-office-bearers-meeting-in-hyderabad

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ, రేపు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీ పదాధికారుల సమావేశాన్ని ఇవాళ ఉదయం ప్రారంభించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీపం వెలిగించి ఈ సమావేశానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. మొత్తంగా 352 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొననున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/