సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై బీజేపీ ఫ్లెక్సీలు

హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యనిర్వహణ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలను బిజెపి అగ్ర నేతలు హాజరయ్యారు. చాల ఏళ్ల తర్వాత బిజెపి సమావేశాలు జరుగుతుండడం తో భాగ్యనగరమంతా ప్లెక్సీ లు , హోర్డింగ్ లతో నింపేలాయని బిజెపి నేతలు ప్లాన్ చేసారు. కానీ అంతకంటే ముందే టిఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి కేసీఆర్ , కేటీఆర్ ప్లెక్సీ లు , హోర్డింగ్ లతో నింపేసింది. అయినప్పటికీ బిజెపి నేతలు కేసీఆర్ ప్లెక్సీ లపై బిజెపి ప్లెక్సీ లు అతికించడంఫై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విజయ సంకల్ప సభకు సంబంధించిన ఫ్లెక్సీలను మెట్రో పిల్లర్లకు అతికించారు. గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచనతో ఆ పార్టీ కార్యకర్తలు దిల్ సుఖ్ నగర్ నుండి చైతన్యపురి వరకు మెట్రో పిల్లర్లకు అంతకుముందే ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై బీజేపీ ఫ్లెక్సీలను అతికించారు. దీనిపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.