అచ్చెన్నాయుడికి కోరుకున్న చోట వైద్యం : ముఖ్యమంత్రి ఆదేశం

ఆపరేషన్ గాయం తిరగబెట్టింది: జీజీహెచ్ వెల్లడి

అచ్చెన్నాయుడికి కోరుకున్న చోట వైద్యం : ముఖ్యమంత్రి  ఆదేశం
Achennaidu

Amaravati: ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడికి కోరుకున్న చోట వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

అచ్చెన్నాయుడికి గతంలో జరిగిన ఆపరేషన్ గాయం తిరగబెట్టిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ చెప్పారు.

ఆయన ఆరోగ్యంపై తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ లో ఈ మేరకు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని, అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆ బులిటెన్ లో పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడు అరెస్టయిన తరువాత అధికారులు ఆయనను సుదీర్ఘ ప్రయాణం చేయించడం వల్లే ఈ గాయం తిరగబెట్టిందని వైద్యులు అంటున్నారు.

గాయం తగ్గడానికి మూడు రోజులు పట్టవచ్చని బులిటెన్ లో పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/