పవన్ కళ్యాణ్ ను చూసి నేర్చుకోండి అంటూ యువ హీరోలకు బండ్ల గణేష్ చురకలు

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన మనసులో ఏమున్నా అది ఎలాంటి విషయమైనా ఏమాత్రం దాచుకోకుండా బయటకు చెప్పేస్తుంటాడు గణేష్. ఇక ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే గణేష్..తాజాగా యువ హీరోల ప్రవర్తన ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఓ ఈవెంట్ లో అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వీరి తీరుపై బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించారు. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’ అని ట్వీట్ చేశారు. దీనికి తోడు చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిత్రసీమలో కమెడియన్ గా అడుగుపెట్టిన గణేష్..అతి తక్కువ టైం లోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ అంటే దేవుడిగా కొలిచే గణేష్..ఆయనతో రెండు సినిమాలు చేసాడు.