మణిపూర్ ఘటన : నిందితుడి ఇంటిని కాల్చిన స్థానికులు

మణిపూర్ లో ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించడం, సామూహిక అత్యాచారానికి పాల్పడడం ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మణిపూర్ పోలీసులు తెలిపారు. మిగతా వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ కేసులో ఓ నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పు పెట్టి కాల్చేశారు.

గత రెండు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు, లూటీలు, దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులతో అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటి వరకూ 140 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. హింసను కట్టడి చేయడానికి ప్రభుత్వ చేపట్టిన చర్యలు అంతగా ఫలించడం లేదు. మైతీలను ఎస్జీ జాబితాలో చేర్చడానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుండటమే ఈ దాడులకు కారణం. దీనిని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించడం, సామూహిక అత్యాచారానికి పాల్పడడం ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.