శ్రీశైలం వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త

శ్రీశైలం వెళ్లే భక్తులకు TSRTC గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్, శ్రీశైలం క్షేత్రానికి మధ్య 10 ఏసీ బస్సులు నడిపించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ రూట్లో నాన్ ఏసీ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు AC బస్సులను నడిపించబోతుంది. హైదరాబాద్, శ్రీశైలం మధ్య కొత్తగా 85 బస్సులు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో 75 ఎక్స్ప్రెస్ బస్సులు, 10 ఏసీ బస్సులు. ఈ కొత్త బస్సులను సీఎం రేవంత్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో ప్రారంభిస్తారు.