ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల బంద్ కొనసాగింపు

ప్రభుత్వంతో ప్రైవేట్ ఆస్పత్రుల చర్చలు మరోమారు విఫలమయ్యాయి. రూ.1500 కోట్ల బకాయిల్లో రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO రూ.203 కోట్లు విడుదల చేస్తామన్నారని పేర్కొంది. దీంతో స్కీమ్ సేవల బంద్ కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. మార్చి31 వరకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తామని నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి తెలిపాయి.

కానీ ప్రభుత్వం రూ.203 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. తక్షణమే రూ. 800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ఆసుప్రతులు కోరాయి. ప్రభుత్వం రూ.1500 కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందని అందులో కనీసం రూ. 800 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ వై. రమేష్, ప్రధాన కార్యదర్శి సి. అవినాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం తాత్కాలికంగా రూ. 203 కోట్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం మరోమారు ఆరోగ్యశ్రీ సీఈవోతో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.