అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తున్నాని హర్బజన్ ప్రకటన

మరికొద్ది గంటల్లో అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు యావత్ దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి రావాల్సిందిగా దేశ వ్యాప్తంగా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ దైవ కార్యక్రమాన్ని రాజకీయంగా చూడవద్దని పేర్కొంది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ వెల్లడించారు.

ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని విపక్ష పార్టీలకు ఆయన హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్ముతాను.. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని స్పష్టం చేసారు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనుంది. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ..బాయ్‌కాట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో హర్భజన్‌ ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.