జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి

రాహుల్ గాంధీకి నా సమాధానం ఇదే ..ట్విట్టర్ లో వీడియోను పెట్టిన అమిత్ షా

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్‌కు తన సమాధానం ఇదేనంటూ హోమ్ మంత్రి అమిత్ షా, తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ లో ఓ సైనికుడి తండ్రి మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు తేవద్దని ఆయన కోరారు. ‘ఓ ధీశాలి అయిన ఆర్మీ మ్యాన్ తండ్రి రాహుల్ గాంధీకి చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చారు. దేశమంతా ఏకతాటిపై ఉన్న వేళ, రాహుల్ గాంధీ కూడా తుచ్ఛమైన రాజకీయాలు పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/