వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తార్ కలయికలో గాండీవధారి అర్జున అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. గని , ఎఫ్ 3 లతో వరుస ప్లాప్స్ అందుకున్న వరుణ్ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

‘గాండీవధారి అర్జున’ మూవీలో వరుణ్ తేజ్.. జేమ్స్ బాండ్ తరహా పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. చేతిలో గన్ పట్టుకొని అగ్రెసివ్ ఇంటెన్సిటీతో కనిపించారు వరుణ్ తేజ్. ఈ లుక్ చూస్తుంటే గతంలో ఎన్నడూచూడని విధంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గానే ఉంచారు మేకర్స్. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారని సమాచారం. ఈ సినిమా పూర్తి కాగానే కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా డైరెక్షన్ లో వరుణ్ మరో సినిమా చేయనున్నాడు.