వెయ్యి కోసం ప్రాణం తీసుకున్న యువకుడు

suicide cases

వెయ్యి రూపాయిల కోసం ప్రాణం తీసుకున్న ఘటన బీబీ నగర్ లో చోటుచేసుకుంది. ఇటీవల చాలామంది యువతీ , యువకులు చిన్న చిన్న వాటికే కోపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తల్లిదండ్రులు మందలించారని లేదా అడిగినంత డబ్బులు, కోరిన కోర్కెలు తీర్చలేదని, మార్కులు సరిగా రాలేదని, స్నేహితుడు తిట్టాడని ఇలా చిన్న చిన్న వాటికీ మనస్థాపానికి గురై బలవనర్మణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇంట్లో చేసిన దొంగతనం బయటపడటంతో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీ నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఘట్కేసర్ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన దలాల్ ఉదయ్ కిరణ్ (18) ఇంటర్మీడియట్ చదివాడు. అప్పడప్పుడు ఇంట్లో తల్లి దాచుకున్న డబ్బులను కిరణ్ తన అవసరాల కోసం దొంగతనం చేస్తూ ఉండేవాడు. దీంతో అతడికి అది అలవాటుగా మారిపోయింది. ఈ నెల 12వ తేదీన కూడా అలాంటి పనే చేశాడు. తల్లి బీరువాలో దాచిన రూ.వెయ్యి దొంగతనంగా తీసుకున్నాడు. దీంతో తల్లికి అనుమానం వచ్చి కిరణ్‌ను నిలదీసింది. బీరువాలోని రూ.2 వేలు కనిపించడం లేదని ప్రశ్నించింది. తల్లి గట్టిగా అడిగేసరికి తాను రూ.వెయ్యి మాత్రమే తీసుకున్నానంటూ తల్లికి కిరణ్ వాయిస్ మెసేజ్ పంపించాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేసేశాడు. దొంగతనం బయటపడటం, తల్లి గట్టిగా మందలించడంతో కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో క్షణికావేశంలో రైలు కింద పడి గురువారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కీసర-బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యువకుడు ట్రైన్ పట్టాల మీద పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కిరణ్ మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. కొడుకు మృతి తో ఆ ఇంట్లో విషాదం అల్లుకుంది.