వైసీపీ ఎంపీ కుమారుడి నిశ్చితార్థ వేడుకల్లో మెగాస్టార్

వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్‌ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. సోమవారం హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ , రాజకీయ నేతలు హాజరై నూతన వదువువరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరజీవి కుటుంబ సమేతంగా హాజరవ్వడం వేడుకకు మరింత కళ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మేకతోటి సుచరిత, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు నటులు కైకాల సత్యనారయణ, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, ఎస్‌.గోపాల్‌రెడ్డి, రమేశ్‌వర్మ, బి.గోపాల్, సంగీత దర్శకులు కోటి, టాలీవుడ్‌ రచయిత బుర్రా సాయిమాధవ్‌ మొదలగువారు వేడుకకు హాజరయ్యారు.